నవతెలంగాణ – గోవిందరావుపేట
రాష్ట్రంలోని పలు క్రీడా పాఠశాలలకు విద్యార్థులకు ఎంపికలో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినట్లు మండల విద్యాధికారి తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియ కు మండలంలో వివిధ గ్రామాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది.ఇందులో ఎంపికైన క్రీడాకారులను ఈ నెల 09-07-2023 నుండి 15-07-2023 వరకు ములుగు లో జిల్లాస్థాయిలో ఎంపిక జరుగుతుంది. ఇందులో ఎంపికైన విద్యార్హులను రాష్ట్ర స్థాయిలో జరిగే ఎంపికకు పంపబడును కావున విద్యార్థుల తల్లీ దండ్రులు గమనించగలరని స్థానిక ఎం. ఈ. వో గొంది. దివాకర్ తెలిపారుఈ ఎంపిక ప్రక్రియలో స్పోర్ట్స్ ఆఫీసర్ యాలం. ఆదినారాయణ, పీడీలు మెడిశెట్టి. సుధాకర్, కనకయ్య, కృష్ణ, పి. ఈ.. టి లు దీప్తి, నరేష్ పాల్గొన్నారు