నూతన వధూవరులను ఆశీర్వదించిన సీతక్క

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో కొంరెడ్డి చెన్నారెడ్డి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం తాడువాయి మండల యూత్ కాంగ్రెస్ నాయకులు గంటా సాయిరెడ్డి వివాహానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లంటే నూరేళ్ల పంట అని వధూవరులు ఒకరినొకరు అర్థం చేసుకుని కలకాలం కాపురం ఉండాలని దీవించారు.ఈ కార్యక్రమంలో సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, తాడ్వాయి సహకార సంఘ అధ్యక్షులు పులి సంపత్, జిల్లా నాయకులు అర్రేమ్ లచ్చుపటేల్, తాడ్వాయి సర్పంచ్ ఇర్ప సునీల్, చింత క్రాంతి, బద్దం లింగారెడ్డి, తాడ్వాయి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love