చిన్నారులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సీతక్క..

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో పీఎస్ఆర్ గార్డెన్స్ లో శుక్రవారం బుర్ర వేణు కుమార్తె మరియు కుమారుడు పంచ కట్టు మరియు నూతన వస్త్ర అలంకరణ మహోత్సవానికి ఎమ్మెల్యే సీతక్క హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఉజ్వల భవిష్యత్తుతో చక్కగా రాణించాలని ఎలాంటి ఆటంకాలు లేకుండా భవిష్యత్తు కొనసాగాలని దీవించారు.ఈ కార్యక్రమంలో సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, గ్రామ అధ్యక్షులు మరియు ఉపసర్పంచ్ బద్దం లింగారెడ్డి, సదా శివుడు తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love