తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా కొండి మల్లారెడ్డి

నవతెలంగాణ – సిద్దిపేట
తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా సిద్దిపేటకు చెందిన ప్రముఖ కవి, రచయిత కొండిమల్లారెడ్డి ఎన్నికయ్యారు. నిన్న కరీంనగర్ ఫిల్మ్,భవన్ లో జరిగిన రాష్ట్ర సర్వ సభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాకుచెందిన పర్కపెల్లి యాదగిరి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, ఉప్పల పద్మ, సడాకుల కిషన్ రాష్ట్ర కార్యదర్శులుగాఎంపికయ్యారు. ఈసందర్భంగా వెన్నెల సాహితీ సంగమంబాధ్యులు వంగరనరసింహారెడ్డి, అశోకరాజు, మహమూద్ పాషా, రాంచందర్రావు, గాలిరెడ్డి, త్రివిక్రమశర్మ, మోహన్, మహిపాల్, మహెందర్, పిడిశెట్టిరాజు, ఉప్పలపద్మ, ఉమాశంకర్, యేసురాజు, తదితరులు అభినందనలు తెలియజేశారు. సాహిత్య విలువలను పెంపొందిస్తూ, తెలంగాణ భాషా, సంస్కృతుల వికాసానికి కృషి చేస్తూ, సంఘాన్ని పటిష్టంచేయాలని వారు కోరారు.

Spread the love