లక్ష్మిపురంలో విశ్రాంతి భవనాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజును తీసుకువచ్చే పెనక వంశీయులు,  భక్తుల విడిది కోసం ఏర్పాటుచేసిన నూతనంగా ఏర్పాటు చేసిన విశ్రాంతిభవనాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహబూబాద్ జిల్లా గంగారం మండలం పూను గుండ్ల గ్రామం నుండి మేడారం జాతరకు సమ్మక్క భర్త  పగిడిద్దరాజు ను తీసుకువస్తున్న క్రమంలో సాయంత్రం వేళ లక్ష్మీపురంలో విడిది చేసి మరుసటి రోజు ఉదయం మేడారం ప్రయాణం కొనసాగుతుంది. గతంలో పకడిద్దరాజు భక్తజనం పెనక వంశీయులు విశ్రాంతి తీసుకున్నటకు గ్రామస్తులను వారి గృహాలను వినియోగించుకునేవారు ప్రస్తుతం వారి విడిది కొరకు ప్రభుత్వ నిధులతో నూతన భవనాన్ని నిర్మించి ఇవ్వడం జరిగిందని అన్నారు. అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ భవనం పగిడిద్దరాజును తీసుకువచ్చే వారి విశ్రాంతి కొరకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గ్రామ పెద్దలు పూజారులు పెనక ఇదయ్య సమ్మయ్య కృష్ణయ్య సమ్మక్క సారయ్య విజయలక్ష్మి సత్యనారాయణ లక్ష్మయ్య రవి నరేష్ సంతోష్ మరియు పెనక వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Spread the love