సత్యనారాయణ మృతి బాధాకరం: మంత్రి సీతక్క

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రానికి చెందిన నిమ్మగడ్డ సత్యనారాయణ మృతి బాధాకరం అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకట కృష్ణ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన నిమ్మగడ్డ సత్యనారాయణ మరియు సురపనేని విజయ సారథి కుటుంబ సభ్యులను మంత్రి సీతక్క పరామర్శించారు.ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ సూరపనేని విజయ సారథి మరియు నిమ్మగడ్డ సత్యనారాయణ మృతి విచరకరమని అన్నారు. వారి చిత్రపటాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.
త్రాగునీటి పంపుసెట్ ప్రారంభించిన సీతక్క: మండల కేంద్రంలో రంగాపురం కాలవ  వద్ద నివసిస్తున్న   ప్రజలు  నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న సీతక్క  ఎన్నికల సమయం లో మాట ఇచ్చిన ప్రకారం తన స్వంత నిధులతో  బోరింగ్ వేయించి ఈ రోజు కొబ్బరి కాయ కొట్టి బోరింగ్ ద్వారా నీటిని అక్కడి వారికి అందించారు , ఈ కార్యక్రమంలో కిషాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్  ,రాష్ట్ర జిల్లా  మండల నాయకులు  జెట్టి సోమయ్య,,నాగేందర్ రావు ,పెందెం శ్రీకాంత్ ,వెంకటేశ్వర్ రావు,ఏడుకొండలు , సూది రెడ్డి జయమ్మ , నాగ మని ,జోగా ,శేకర్ ,  కార్య కర్తలు పాల్గొన్నారు.
Spread the love