లక్నవరం పర్యాటక కేంద్రం సందర్శన నిలిపివేత

– ఎస్ ఐ ఎస్ కె మస్తాన్ పసర పోలీస్ స్టేషన్
నవతెలంగాణ – గోవిందరావుపేట
భద్రత కారణాల దృష్ట్యా నేటి నుండి లక్నవరం పర్యాటక కేంద్రం పర్యాటకుల సందర్శనను నిలిపివేస్తున్నట్లు పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎస్.కె మస్తాన్ తెలిపారు. సోమవారం పసర పోలీస్ స్టేషన్లో ఎస్సై మస్తాన్ మాట్లాడుతూ.. మేడారం జాతర సందర్భంగా పోలీసులంతా బందోబస్తు లో నిమగ్నమై ఉన్నందున పర్యాటకులకు రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. నేటి నుండి ఈనెల 25 వ తారీకు వరకు లక్నవరం పర్యాటక కేంద్రానికి పర్యాటకుల సందర్శన అనుమతి ఉండదని ఈ విషయాన్ని పర్యాటకులు గ్రహించి సహకరించాలని కోరారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు తీసుకోవలసి వచ్చిందని మహా జాతర సందర్భంగా పర్యాటకులు  సహస్కరించి తోడ్పాటు అందించాలని అన్నారు.
Spread the love