MI vs SRH : టాస్ గెలిచిన ముంబై..బ్యాటింగ్ ఎవరిదంటే..?

నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ రోజు రాత్రి 7.30 గంటలకు వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనున్నాయి. పాయింట్స్ టేబుల్ లో ముంబై జట్టు ఆఖరున ఉండడమే కాదు, ప్లేఆఫ్ అవకాశాలను కూడా కోల్పోయింది. పైగా ఆ జట్టులోని స్టార్ ప్లేర్ లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి మూడోస్థానంలోకి వెళ్లాలని చూస్తుంది. ముంబైతో జరిగిన మొదటి మ్యాచ్ హైదరాబాద్ జట్టు భారీ స్కోరు సాధించింది. మరి ఈ మ్యాచ్ లోఎంత స్కోరు సాదిస్తుందని అభిమానులు ఆసక్తికరంగా మారింది. ఇక కాసేపటి క్రీతం టాస్ వేయగా ముంబై జట్టు కెఫ్టెన్ హర్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ దిగనుంది.

Spread the love