నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి సీతక్క 

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పలు గ్రామాలలో పలు వివాహ శుభకార్యాలలో పాల్గొని మంత్రి సీతక్క శుక్రవారం నూతన జంటలను ఆశీర్వదించారు. మండలం లోని పస్రా గ్రామానికి చెందిన ఏనుగు సునీత  కుమార్తె వివాహానికి, మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు కీ.శే. మద్దినేని శ్రీనివాస్  కుమారుడు వివాహానికి, సండ్రగూడెం గ్రామానికి చెందిన గణేష్ లాల్  కుమార్తె వివాహానికి తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి దనసరి సీతక్క గారు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు .ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, జిల్లా, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love