ప్రతి ఒక్కరూ హెచ్ఐవి/ఎయిడ్స్ పరీక్ష చేయించుకోవాలి

– టి. కిషన్, వై ఆర్ జి కేర్ సంస్థ లింకు వర్కర్
నవతెలంగాణ – గోవిందరావుపేట
ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెచ్ఐవి/ఎయిడ్స్ పరీక్ష చేయించుకోవాలని వై ఆర్ జి కె సంస్థ లింకు వర్కర్ టి కిషన్ అన్నారు. సోమవారం మండలంలోని పస్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆశ డే  మీటింగ్ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సిహెచ్ మధు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో  వై ఆర్ జి  కేర్ సంస్థ   లింక్ వర్కర్  టీ. కిషన్ గారు  హెచ్ఐవి/ఎయిడ్స్ పై  అవగాహనా  కల్పించడం జరిగింది.  ప్రతి ఒక్కరికి  హెచ్ఐవి పరీక్ష  చేయించు కోవాలి అని అన్నారు.  ఏమన్నా  సందేహం వస్తే  దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి లో  ఐసీటీసీ కేంద్రం లో  హెచ్ఐవి పరీక్ష చేయించు కోవాలి అన్నారు. ప్రాణాంతకమైన హెచ్ఐవి సుఖ వ్యాధి  4 మార్గాలు గా  వస్తాయి   1)సురక్షితం కానీ లైంగిక సంబంధాలు వల్ల  2). కలిసితమైన సూదులు  ఇంజక్షానలా  ద్వారా   3). పరీక్షంచ్చని రక్త మార్పిడి వల్ల   4). హెచ్ఐవి గర్భిణీ స్త్రీ నుండి పుట్టబోయే  బిడ్డకి  వస్తుంది   అందుకే  ప్రతి ఒక్కరికి  హెచ్ఐవి /ఎయిడ్స్ పట్ల  అవగాహనా  కల్గి ఉండలి అని అన్నారు   ఈ మీటింగ్ లో   హెల్త్ సూపర్ వేజర్లు   ఏఎన్ఎం లు   ఆశ కార్య కర్తలు పాల్గొన్నారు.
Spread the love