దెయ్యాల వాగులో వెంకట్ రెడ్డి మృతదేహం లభ్యం

నవతెలంగాణ-గోవిందరావుపేట

మండలంలోని దుంపలగూడెం గ్రామానికి చెందిన దాసరి చిన్న వెంకటరెడ్డి మృతదేహం వారం రోజుల తర్వాత దెయ్యాలవాగులో లభ్యమయింది. ములుగు డి.ఎస్.పి రవీందర్ కథనం ప్రకారం ఈనెల 6న పసర పోలీస్ స్టేషన్లో వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులు వెంకట్ రెడ్డి కనబడడం లేదని ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఆదివారం ఉదయం దెయ్యాల వాగు శేషు మడుగు ప్రాంతంలో కొందరు ఒక గుర్తుపట్టని స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసి సమాచారం ఇవ్వడంతో పరిశీలించగా మృతుని తువ్వాలలో రాళ్లు కట్టి నీటిలో విడిచిపెట్టినట్లుగా ఉందన్నారు. అంతేకాక మృతుని వ్యవసాయ క్షేత్రం నుండి సుమారు రెండు కిలోమీటర్ల పరిధిలో మృతదేహం వాగు నీటిలో లభ్యమవడం తూవాలలో రాళ్లు కట్టి ఉండడం అరికాలు ప్రాంతంలో ఇంజురీస్ కావడం చూస్తే ఇది అనుమానాస్పదంగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవల కొందరు అడవి జంతువుల కోసం విద్యుత్తు వైర్లు అమరుస్తున్న క్రమంలో ఇది జరిగి ఉండవచ్చా అన్న కోణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెంకట్ రెడ్డి కుమారుని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Spread the love