సీతక్క గెలుపుతో మొక్కులు తీర్చుకున్న ముత్తాపూర్ గ్రామస్తులు

నవతెలంగాణ గోవిందరావుపేట
సీతక్క గెలవాలని గెలిస్తే కాలినడకన పాదరక్షలు లేకుండా వచ్చి మొక్కలు తీర్చుకుంటామని ముత్తాపూర్ గ్రామస్తులు తెలిపారు. ఆదివారం మీడియాతో ముత్తాపురం గ్రామ ఉపసర్పంచ్ దవగట్ల కృష్ణ మాట్లాడుతూఎన్నికలకు ముందు సీతక్క గెలవాలని గెలిస్తే చెప్పులు లేకుండా కాలినడకన మేడారం వచ్చే మొక్కులు తీర్చుకుంటామని గ్రామస్తులు ముత్తాపూర్ గ్రామస్తులు ముడుపు కట్టారు. దానిలో భాగంగా నేడు కాంగ్రెస్ గ్రామ కార్యకర్తలు సమ్మక్క సారలమ్మల మొక్కులు చెల్లించేందుకు పాదరక్షలు లేకుండా కాలినడకన బయలుదేరి మొక్కులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే మాదిరిగా బుక్కులు చెల్లించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తాపూర్ గ్రామస్తులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ మహిళలు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love