– బండారి రవికుమార్ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఇటీవల కాలంలో వచ్చిన తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వమే పూర్తిస్థాయిలో ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు బండారి రవికుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని పసరలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశం గ్యానం వాసు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు బండారి రవికుమార్ సూడి కృష్ణారెడ్డి లు హాజరై మాట్లాడారు. ఇటీవల తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు ములుగు జిల్లా రైతంగం పంటలు కోసి రోడ్లమీద పోసి కొన్ని ధాన్యం కుప్పలు పోసి ధాన్యానికి ఆరబోసు కులెందుకు జాగలేక రైతులు ధాన్యం పొలాల్లో తడిసిపోయిందని మూడు రోజులకు వర్షాల కారణంగా అడుగు ధాన్యం తడిసి మొలకెత్తిందని వెంటనే తడిసిన ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా జిల్లాలో ప్రధానంగా గోదావరి పరిహక ప్రాంతంలో మిర్చి తోటలు కాయలు పూత దెబ్బతిని గాలికి ఒరిగిందని 30% పంట దెబ్బతిన్నదని రైతులు పేర్కొంటున్నారని పేర్కొన్నారు. నష్టపోయిన మిర్చి ఇతర పంటల రైతులని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల హామీలు క్వింటా ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించిందని వెంటనే ప్రభుత్వం రైతులని 500 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆరు హామీలలో రెండు అమలు చేసినారని రైతులకు సంబంధించి రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రెడ్డి సాంబశివ, రత్నం రాజేందర్, ఎండి అంజాద్ భాష, తీగల ఆదిరెడ్డి, పొదిలి చిట్టిబాబు, గొంది రాజేష్, ఎండి దావూద్, కొప్పుల రఘుపతి, కుమ్మరి శీను, వంక రాములు, ఎండిగపూర్ బాషా, చిరంజీవి, చిన్న* తదితరులు పాల్గొన్నారు.