ఒక్క గేమ్ రోహిత్ శర్మను చెత్త కెప్టెన్‌గా మార్చదు : గంభీర్

Rohit-Gambirనవతెలంగాణ – హైదరాబాద్: వన్డే వరల్డ్ కప్ ఓడిపోయినప్పటికీ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్…. రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించారు. “సారధిగా రోహిత్ జట్టును చక్కగా నడిపాడు. ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలవడం, ఫైనల్ వరకు భారత్ ఆధిపత్యం చెలాయించడం అంత సులభం కాదు. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉన్నా ఇండియా ఛాంపియన్స్ లాగా ఆడింది. ఒక్క బ్యాడ్ గేమ్ రోహిత్ శర్మను చెత్త కెప్టెన్ గా మార్చదు. రోహిత్ ను కానీ జట్టును కానీ నిందించడం సరికాదు” అని తెలిపాడు. కాగా, టి20 ప్రపంచకప్ వరకు మాత్రమే కాకుండా కోచ్ గా ద్రవిడ్ ను మరికొంతకాలం ఉండేలా బీసీసీఐ ప్లాన్ చేస్తుందని జైషా తెలిపాడు. ప్రస్తుతం ద్రవిడ్ టీమిండియాతో సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్నాడు. అది ముగిసిన తర్వాత ద్రవిడ్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జైషా వెల్లడించాడు. అయితే పొట్టికప్ లో రోహిత్ స్థానం గురించి గ్యారెంటీ ఇవ్వలేమని జైషా అన్నాడు. దీంతో రోహిత్ దూరం కానున్నాడని తెలుస్తోంది.

Spread the love