టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా అజిత్ అగార్కర్

నవతెలంగాణ – హైదరాబాద్
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) జాతీయ సీనియర్ సెలెక్షన్ కమిటీకి నూతన చైర్మన్ ను ఎంపిక చేసింది. టీమిండియా మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ ను చీఫ్ సెలెక్టర్ గా నియమించింది. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన చేసింది. టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ముగ్గురు సభ్యుల సలహా సంఘం ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూలో మెరుగైన ప్రజంటేషన్ ఇచ్చిన అజిత్ అగార్కర్ ను చీఫ్ సెలెక్టర్ గా ఎంపిక చేశారు. కాగా, జాతీయ సెలెక్షన్ కమిటీలో సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్, శివసుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ సభ్యులుగా ఉంటారు. వీరు జోన్ల వారీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 45 ఏళ్ల అగార్కర్ అంతర్జాతీయ క్రికెట్ కు ఎప్పుడో వీడ్కోలు పలికాడు. కెరీర్ లో 26 టెస్టులాడిన ఈ ముంబయి బౌలింగ్ ఆల్ రౌండర్ 58 వికెట్లు తీశాడు. టెస్టుల్లో అగార్కర్ కు ఒక సెంచరీ కూడా ఉంది. వన్డేల్లో 191 మ్యాచ్ లాడి 288 వికెట్లు పడగొట్టాడు. 4 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన అగార్కర్ 42 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాడు.

Spread the love