నవతెలంగాణ – జకార్త: స్టార్ షట్లర్లు హెచ్‌ఎ్‌స ప్రణయ్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ఇండోనేసియా ఓపెన్‌కు సిద్ధమయ్యారు. మంగళవారం ప్రారంభమవనున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లో నిషిమోటో (జపాన్)తో ప్రపంచ 8వ ర్యాంకర్ ప్రణయ్ తలపడనున్నాడు. ప్రణయ్ ఈ టోర్నీలో భారత్ నుంచి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. తెలుగు షట్లర్లు సింధు, శ్రీకాంత్ చివరి 2-3 టోర్నమెంట్లలో ఘోరంగా విఫలమవడం తెలిసిందే. ఈ టోర్నీలోనైనా సత్తా చాటి, తిరిగి ఫామ్‌లోకి రావాలని ఈ ఇరువురు షట్లర్లు పట్టుదలతో ఉన్నారు. ఇక, పురుషుల డబుల్స్ వరల్డ్ నెంబర్ 5 ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ తమ అదృష్టాన్ని పరీక్షించకోనున్నారు.