ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సమీర్‌కు మధ్యంతర బెయిల్

నవతెలంగాణ – ఢిల్లీ
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు సమీర్ మహేంద్రుకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సమీర్ మహేంద్రు మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. వైద్యపరమైన కారణాలతో, వెన్నుకు ఆపరేషన్ కోసం ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కోర్టు ఆరు వారాల మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. బెయిల్ గడువు ముగిసిన తర్వాత జూలై 25న ట్రయల్ కోర్టు ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.

Spread the love