ప్రధాన కాలువల గండ్లను పరిశీలించిన ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి

నవతెలంగాణ-గోవిందరావుపేట

మండలం లోని బుస్సాపూర్ గ్రామంలో ఆదివారం ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు సూరపనేని సాయికుమార్ లు  ప్రధాన కాలువల గండ్లను పరిశీలించడం జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షానికి లక్నవరం చెరువు ప్రధాన కాలువలకు గండ్లు పడి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు,వరి నాట్లు వేయడం కూడా లేట్ అవుతుంది, రైతులు బాధపడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకున్న ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి వెనువెంటనే బుసపూర్ వెళ్లి ప్రధాన కాలువైన నరసింహుల కాలువ, రాళ్లమాటు, సద్దిమడుగు, పలుసామాటు ,మరికొన్ని కాలువలను సందర్శించి జరిగిన నష్టాన్ని వెనువెంటనే శారవాణిలో తహసిల్దార్  కి తెలియజేయడం మరియు ఆ గండ్లను పూడ్చడం కోసం  ఖర్చును అంచనా వేయవలసిందిగా,  నీటిపారుదల శాఖ అధికారులని కోరడం జరిగింది, రైతులందరినీ కలుపుకొని సోమవారం ములుగు జిల్లా కలెక్టర్ ని కలిసి సమస్యలకు పరిష్కారమయ్యేలా చూస్తానని అక్కడి రైతులకు హామీ ఇవ్వడం జరిగింది ఎవరు కూడా ఆందోళన పడవద్దని మీకు ఎల్లవేళలా బిఆర్ఎస్ పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని వారికి హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో  బుసపూర్ సర్పంచ్ సింగం చందు శ్రీలత,  గోవిందరావుపేట అధికార ప్రతినిధి భూ రెడ్డి మధు,ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్,పృథ్వీరాజ్ ఊట్ల మీడియా కోఆర్డినేటర్, చింతల లింగారెడ్డి, కె రాంబాబు, గురువయ్య, గోనే రామ్ రెడ్డి, ఎస్ సాంబయ్య, అంగిని నాయుడు, మీస రాజు, కిషన్, జయపాల్ రెడ్డి, భూక్య దేవా నాయక్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love