సీపీఎం నాయకునిపై దాడి చేసిన భూస్వాములను కఠినంగా శిక్షించాలి

– పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ డిమాండ్
నవతెలంగాణ- గాంధారి
సీపీఎం పార్టీ నాయకుని పై దాడి చేసిన  భూస్వాముల గూండాలను కఠినంగా శిక్షించాలిసిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్  డిమాండ్ ఆదివారం
గాంధారి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో  నిరసన చేయడం జరిగింది అనంతరం సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ ఏరియా కార్యదర్శి మూతిరాం నాయక్ మాట్లాడుతూ భూమి లేని పేదలకు భూమి కావాలని కోరుతూ మాత్ సంఘం గ్రామం లోని పేద రైతులు గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ భూములను చదును చేస్తుంటే అప్పటికే ఆ భూములను ఆక్రమించిన నలుగురు భూస్వాములు ఒక్కొక్కరికి 30 ఎకరాల చొప్పున ఆక్రమించిన భూస్వాములు చదును చేసి సంవత్సరానికి మూడు ఎకరాలు చొప్పున అమ్ముకుంటున్నారు అలాంటి భూమిని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని అధికారులకు దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. దీనితో ఆగ్రహించిన భూస్వాములు కొంతమంది గుండాలచే సిపిఎం పార్టీ  మండల నాయకుడు కమ్మరి సాయిలుపై దాడి చేయడం జరిగింది గత వారం రోజుల క్రితం ఒక కార్యకర్తపై కూడా దాడి చేయడం జరిగింది. దాడి చేసిన వారిని  కఠినంగా శిక్షించాలని అదేవిధంగా భూస్వాములు ఆక్రమించుకున్న భూములను వారి చర నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ భూమిని భూమి లేని నిరుపేదలకు   ఒక్కో కుటుంబానికి 1 ఎకరం చొప్పున 150 కుటుంబాలకుపంచాలని డిమాండ్ చేశారులేకపోతే సిపిఎంపార్టీ ఆధ్వర్యంలోని భూ పోరాటాలు నిర్వహించి భూములు పేదలకు పంచుతామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట గౌడ్ తో పాటు ఎల్లారెడ్డిఏరియా నాయకులు మోతిరాం నాయక్, మండల నాయకులు కమ్మరి సాయిలు, మదు, గేమిసింగ్, చందర్, పూరీ, సోనీ,హరిచంద్, రాంసింగ్ తదితరులు పాల్గొన్నారు
Spread the love