స్టీల్ ఫ్యాక్ట‌రీలో పేలుడు…ఒకరు మృతి

నవతెలంగాణ – రాయ్‌పూర్: చ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఆదివారం ఓ స్టీల్ ఫ్యాక్ట‌రీలో పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడు కార‌ణంగా ఫ్యాక్ట‌రీలో ప‌నిచేస్తున్న ఓ కార్మికుడు మ‌ర‌ణించాడు. ర‌స్మారాలోని రాయ్‌పూర్ స్టీల్ ప్లాంట్‌లో స్టీల్‌ను క‌రిగిస్తుండ‌గా పేలుడు చోటుచేసుకుంది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ప్లాంట్‌లో 100 మంది కార్మికులు ప‌నిచేస్తున్నారు. గాయ‌ప‌డినవారిని భిలాయ్‌లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పేలుడుకు కార‌ణాలేంట‌నేది ఇంకా వెల్ల‌డికాలేదు. ఈ ఘ‌ట‌న‌పై ప్రాధ‌మిక ద‌ర్యాప్తు అనంత‌రం ఇత‌ర వివ‌రాలు వెలుగుచూస్తాయ‌ని అధికారులు చెబుతున్నారు.

Spread the love