మిత్రులకు ఆర్థిక అండగా తోటి మిత్రుల సహాయం

నవతెలంగాణ-గోవిందరావుపేట
గత నెలలో కురిసిన అకాల వర్షాల కారణంగా  26 న వచ్చిన వరదలలో నష్టపోయిన  మిత్రుల కుటుంబాలకు 2002-03 లో పదవ తరగతి పూర్తి చేసిన   తోటి  మిత్రులు ఆదివారం చేయూతనందించారు. అందులో భాగంగా లాకావత్  నిర్మల(బిక్య) కుటుంబానికి 20000 రూపాయలు అలాగే వరదలలో నష్టపోయిన మరొకరు క్యాస మమత కుటుంబానికి 10000 రూపాయలు ఆర్ధిక సాహయం చేశారు.  ఆపదలో ఉన్న మిత్రులను స్నేహితుల దినోత్సవ సందర్భంగా పదవ తరగతి బ్యాచ్ మిత్రులకు  అందరూ కలిసి కొంత సాయం చేశారు.  ఒక మిత్రుడికి ఆపద వస్తే మరొక మిత్రుడు ఆదుకునే పద్ధతిలో  ఉండాలి. అలా ఉంటున్నమనీ 2022  పసర పూర్వ విద్యార్థుల  సమ్మేళనం మా మా స్కూల్ విద్యార్థులలో స్నేహాన్ని మరింత పెంపొందించిందినీ క్లాస్మేట్స్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బిరెడ్డి సాంబశివ, ఎల్లబోయిన్ శ్రీను,గొంది రాజేష్,సి.హెచ్ భారతి, మశిక తేజస్వి,వోలాద్ర ప్రవీన్, దేవరపెళ్లి సతీష్, బద్ధం విజయ్,  జిట్టబోయిన రమేష్, కొల్లు మల్లికార్జున్, దిలీప్,తదితరులు పాల్గొన్నారు.
Spread the love