రోడ్డు పక్కన దోశ తిన్న మాజీ మంత్రి హరీశ్ రావు

నవతెలంగాణ – హైదరాబాద్‌: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు రోడ్డు పక్కన టిఫిన్ చేశారు. హరీశ్ రావుతో పాటు మెదక్ లోక్ సభ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కూడా అక్కడే టిఫిన్ తిన్నారు. వెంకట్రామిరెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు హరీశ్ రావు హైదరాబాద్ నుంచి భూంపల్లికి బయలుదేరారు. మార్గమధ్యంలో సిద్దిపేట హౌసింగ్ బోర్డు టిఫిన్ బండిపై వారు టిఫిన్ చేశారు. వారితో దోశ వేయించుకొని హరీశ్ రావు ఆరగించారు.

Spread the love