శిథిలమైన అన్నారం పెద్ద చెరువు ‘పెద్ద కాలువను’ మరమ్మత్తు చేయాలి: సర్పంచులు, రైతులు

నవతెలంగాణ- తాడ్వాయి
మండలంలోని గంగారం గ్రామపంచాయతీ పరిధిలో గల అన్నారం పెద్ద చెరువు యొక్క శిథిలమైన ‘పెద్ద కాల్వ’ ను మరమ్మత్తు చేయాలని కాటాపూర్ సర్పంచ్ పుల్లూరు గౌరమ్మ, గంగారం సర్పంచ్ గౌరబోయిన నాగేశ్వర్ రావు, మరియు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కాటాపూర్ సర్పంచ్ గంగారం సర్పంచ్ లు, రైతులు, నాయకులతో కలిసి పెద్ద చెరువు ‘పెద్దకాల్వ’ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాటాపూర్, గంగారం, భూపతిపూర్ రైతులకు వ్యవసాయానికి సమృద్ధిగా సాగునీరు పెద్ద చెరువులో ఉన్న, పెద్ద కాల్వ శిథిలావస్థకు చేరడంతో సాగునీరు అందగా రైతుల నష్టపోతున్నారని మండిపడ్డారు. ఈ అన్నారం పెద్ద చెరువు పై ఆధారపడి కాటాపూర్, గంగారం, భూపతిపురం, అన్నారం రైతు కుటుంబాలు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయని అన్నారు. ఈ చెరువు పంటలకు సమృద్ధిగా నీరు అందించే సామర్థ్యం కలిగి ఉండి, రెండు పంటలు పండించే నీటి సామర్థ్యం ఉండి రైతులు పంట నష్టమై అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన చెందారు. అన్నారం పెద్ద చెరువు పెద్ద కాల్వ సుమారు మూడు కిలోమీటర్లు ఉంటుందని దీన్ని మరమ్మతు చేయాలని వారు ధ్వజమెత్తారు. నీటిపారుదల శాఖ అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న వారు కనీసం పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కలెక్టర్ దృష్టి పెట్టి రైతుల పాలిట శాపంగా మారిన అన్నారం పెద్ద చెరువు, పెద్ద కాలువను మరమ్మతులు నిర్వహించి, రైతులు సమృద్ధిగా పంటలు పండించుకోవడానికి సహకరించాలని రైతులు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులతోపాటు రైతులు పులి రవి గౌడ్, మేడిశెట్టి పురుషోత్తం, తోట సత్యం, మేడిశెట్టి మల్లయ్య, పుల్లయ్య, సత్యం, తుర్క వీరబాబు పుల్లూరు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love