నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని బీరెల్లి గ్రామానికి చెందిన కుడికాలు సరస్వతికి చెందిన సూడి గేదె ఎస్సీ కాలనీ లోని మినీ ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ వైర్ కి తాకి గురువారం ఉదయం సుమారు 5.00 గంటల ప్రాంతంలో మృతి చెందింది. పాలు అమ్ముకుని జీవనం సాగిస్తున్న సరస్వతి సూడి గేదె విలువ సుమారు 60 వేల రూపాయలు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలు అమ్ముకుని జీవనం సాగించే దానిని, అని బోరున విలపించారు. విద్యుత్ శాఖ అధికారులు, ప్రభుత్వం తరఫున ఆదుకొని సహాయం చేయాలని మహిళా రైతు కుడికాలు సరస్వతి కోరుకుంటున్నారు. కాగా పాలు అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునే కుడికాలు సరస్వతికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గ్రామస్తులు, పలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.