సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్..

నవతెలంగాణ -తాడ్వాయి
తాడ్వాయి మండలంలోని కృష్ణాజి వాడి గ్రామానికి చెందిన గ్రామ ఉపసర్పంచ్ షేర్ బద్దం తిరుపతిరెడ్డి కి 47 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును గురువారం రోజున గ్రామ సర్పంచ్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షులు బండిమీద అరవింద్ టిఆర్ఎస్ మాజీ గ్రామ అధ్యక్షులు రాజేందర్ రావు రైతుబంధు అధ్యక్షులు రామ్ రెడ్డి టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోలీస్ గోపాల్ రావు, కృష్ణమూర్తి, లక్ష్మారెడ్డి కుమ్మరి జగన్ రమేష్ రావు నారాయణ రావు బాలరాజు గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love