ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు


నవతెలంగాణ- తాడ్వాయి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ద ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మండల కేంద్రంలో ఎంపీపీ గొంది వాణిశ్రీ జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని గ్రామ పంచాయతీలలో, పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొంది వాణిశ్రీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్ని సామాజిక వర్గాలకు అండగా నిలిచిందన్నారు. నేటి నుండి 22వ తారీకు వరకు 21 రోజులు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ ముల్కనూరు శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి అల్లెం అప్పయ్య, ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, కో ఆప్షన్ నెంబర్ దిలావర్ ఖాన్, వివిధ శాఖల ఉద్యోగులు, అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love