అనారోగ్యంతో అంగన్వాడీ ఆయా మృతి..

నవతెలంగాణ- తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని గంగారం గ్రామం పంచాయతీ పరిధిలోని అంగన్వాడి సెంటర్1లో ఆయాగా విధులు నిర్వహిస్తున్న కొండూరు వీరమ్మ కొత్త కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. బుధవారం రాత్రి మృతి చెందారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. కాగా మృతిచెందిన వీరమ్మ భర్త కొండూరు మల్సూరు రెండు నెలల క్రితమే మృతి చెందాడు. రెండు నెలల వివదిలోనే భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందడంతో కుటుంబంలోనే కాకుండా ఆ గ్రామంలో, పరిసర గ్రామాలలో కూడా విషాదఛాయలనుకున్నాయి.

Spread the love