విద్యుత్ భద్రత సూచనలు పాటించాలి..

– టీఎస్ ఎన్పీడీసీఎల్ సిఎండి అన్నమనేని గోపాల్ రావు
నవతెలంగాణ -తాడ్వాయి
వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు భద్రత సూచనలు పాటించాలని టీఎస్ ఎన్పీడీసీఎల్ సిఎండి అన్నమనేని గోపాల్ రావు అన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ ను ఆదా చేయడంతో పాటు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే విద్యుత్ అధికారులను సంప్రదించాలన్నారు. వర్షాకాలంలో ఈదురుగాలు, ప్రకృతి వైపరీత్యాల వలన తెగిపడిన విద్యుత్ తీగలు, విరిగిపడిన స్తంభాలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. పంట పొలాల్లో కరెంటు వైర్లు తెగినప్పుడు సంబంధిత విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకురావాలన్నారు. తడి చేతులతో విద్యుత్ పరికరాలను, తీగలను ముట్టుకోరాదు అన్నారు. విద్యుత్ ప్రవహిస్తున్న వైరులకు ఎలాంటి అతుకులు లేకుండా చూసుకోవాలని, ఇలా ఉంటే అనుభవం ఉన్న ఎలక్ట్రిషన్తో సరిచేసుకోవాలన్నారు. రైతులు ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి వెళ్ళకూడదు అని, స్టార్టర్ డబ్బాలను తడవకుండా ఎత్తున, పైన ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఓల్టేజ్ హెచ్చితగులు ఉన్న, ట్రాన్స్ఫార్మర్ల వద్ద శబ్దం వస్తున్న వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్నారు. ప్రమాదాల నుంచి విలువైన ప్రాణాలను రక్షించుకోవాలని సూచించారు. సోదరులు తమ పంట పొలాలను వన్యప్రాణుల అటవీ జంతువుల భారీ నుండి రక్షించుకోవడానికి విద్యుత్ కంచెలు వేసినచో కఠిన చర్యలు తీసుకుంటామని చట్టరీత్యా శిక్షార్హులవుతారని పేర్కొన్నారు. విద్యుత్ సంబంధించిన సమస్యలకు, ఫిర్యాదులు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250028 లేదా 1912 కు అందించాలని తెలిపారు.

Spread the love