మద్యాహ్న భోజనం ఇంటి నుంచే..

నవతెలంగాణ – తాడ్వాయి
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు వెసవి సెలవులు ముగించుకుని ఈ నెల 12న పున : ప్రారంభం అయ్యాయి.వెసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభం అనగానే విద్యార్థులు ఎంతో ఆనందంతో సంతోషంగా గెంతులేసుకుంటూ పాఠశాలకు వెల్లారు. కొత్త తరగతి గదులు, కొత్త బ్యాగులు, కొత్త పుస్తకాలు, పై తరగతి అని ఆనందపడిపోయారు.కాని విద్యార్దులకు మల్లీ అవే ఇబ్బందులు తప్పలేదు.ఇదేనా ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాల తీరు అని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ బడులని చెప్పారు.పాఠశాలల్లో విద్యార్థులకు మద్యాహ్న భోజన సదుపాయం కూడ ఉంటుదని చెప్పారు.కానీ అది కనిపించకపోయేసరికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శాకయ్యారు.మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మద్యాహ్న భోజనమే కరువయ్యింది.మొదటి రోజే ఇలా ఉంటే విద్యాసంవత్సరం అంతా ఎలా ఉంటుందోనని పలువురు అంటున్నారు.
ఇంటి నుంచే భోజనం..
మండలంలోని కృష్ణాజివాడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు మద్యాహ్న భోజనం కరువైంది. విద్యార్థులు ఇంటి నుంచే భోజనం తెచ్చుకుని తిన్నారు. ఇదేంటని నవతెలంగాణ విలేఖరి వెల్లి పాఠశాల ప్రదానొపాద్యాయులును వివరణ కోరగా మద్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు రాలేవని, బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. అందుకోసం పాఠశాలలో భోజనం వండలేదని ఆయన చెప్పారు.

Spread the love