వంట కార్మికుల బకాయి వేతనాలు వెంటనే విడుదల చేయాలి: సిఐటియు డిమాండ్

నవతెలంగాణ – అశ్వారావుపేట
మధ్యాహ్నం భోజనం కార్మికుల బకాయి వేతనాలు వెంటనే విడుదల చేయాలని,పెరుగుతున్న ధరలకు తగ్గట్లుగా పాఠశాల విద్యార్థులు మెనూ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం యం.వీ.వో కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సమస్యలు తో కూడిన వినతిపత్రాన్ని సిఆర్పీ హనుమంతు కు అందజేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థులు కు అప్పు లు చేసి వంట చేసి పెడుతున్న మధ్యాహ్నం భోజనం కార్మికులు కు నెలల తరబడి వంట బిల్లులు,వేతనాలు విడుదల చేయకపోవడం వల్ల అప్పుల పాలవుతున్నారు. అని అన్నారు.విద్యార్థులు కు ఇస్తున్న మెనూ చార్జీలు పెరుగుతున్న ధరలకు ఏ మాత్రం సరి పోడం లేదని అన్నారు.వంటకు గ్యాస్ బిల్లులు కేటాయించకుండా వంట ఎలా చేయాలో ప్రభుత్వం చెప్పాలని అన్నారు.పెండింగ్ బిల్లులు, వేతనాలు, గ్రుడ్లు బిల్లులు వెంటనే విడుదల చేయాలని, ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన రెండు వేల రూపాయలు కు జీవో విడుదల చేయాలని, గ్యాస్ కు బడ్జెట్ కేటాయించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగ దుర్గ, యామిని, వెంకమ్మ, దేవి,నన్ని, గోపమ్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love