నవతెలంగాణ- తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం 163 వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుండి మేడారం దర్శనానికి కారు లో వస్తున్న క్రమంలో ఉదయం నాలుగు గంటల 20 నిమిషాలకు పస్రా దాటిన తర్వాత తాడ్వాయి 163వ జాతీయ రహదారి పై మొండాలతోగు, లవ్వాల స్టేజి మధ్యలో వేగంగా వెళుతున్న కారు ఎదురుంగ వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టుకు ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న బాలమణి(60) అనే మహిళకు తల కు తీవ్రమైన గాయాలై రక్తస్రావం జరిగినది. అకస్మాత్తుగా కారులో మంటలు లేచాయి. 108 కు ఫోన్ చేయగా తాడ్వాయి అంబులెన్స్ ఈఎంటి విజేందర్, పైలట్ సతీష్ హుటాహుటిన చేరుకొని సిపిఆర్ చేసి ములుగు ఏరియా హాస్పిటల్ తరలించారు. వైద్యం పొందుతూ మహిళా మృతి చెందింది. డ్రైవర్ తో సహా మిగతా 5గురు స్వల్ప గాయాలయ్యాయి. ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.