అంగన్వాడి కేంద్రాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం

నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని కాటాపూర్ గ్రామంలో కాటాపూర్-3, కాటాపూర్-4, కాటాపూర్-5 అంగన్వాడి కేంద్రాల టీచర్లు బడిబాట కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు సమతుల్యమైన, పౌష్టికరమైన ఆహారం అందించుతున్నట్లు, పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు వెంకటలక్ష్మి, శ్రీకళ, సుజాత, గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love