– బడి ఈడు పిల్లల ఇంటింటికి ఉపాధ్యాయులు
– కాటాపూర్ లో బడిబాట కార్యక్రమం ప్రారంభం
– కాటాపూర్ హెచ్ఎం జాఫర్ అలీ
నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామంలో శనివారం నాడు బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించే కార్యక్రమం హెచ్ఎం ఎండి జాఫర్ అలీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిర్వహించారు. ఆవాసంలో గల బడి ఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే కార్యక్రమం మొదటి రోజు నిర్వహించారు. హెచ్ఎం జాఫర్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య, నిష్ణార్థులైన ఉపాధ్యాయులచే అందించబడుతుందన్నారు. ఇలాంటి ఫీజులు, రుసుములు లేకుండా ఉచితంగా పుస్తకాలు, దుస్తువులు పంపిణీ చేస్తామన్నారు. అందరూ బడి ఈడు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యనభ్యసించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రజాక్, ఉపాధ్యాయులు ఎం జీవన్ లాల్, జైపాల్, పద్మజా, సుమలత, సి ఆర్ పి వసంతరావు, శ్రీనివాస్, అటెండర్ పూలమ్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.