నవతెలంగాణ- బెజ్జంకి
కత్తి రమేశ్ తన జన్మదినం సందర్భంగా స్థానిక సాయిబాబా ఆలయాభివృద్ధికి రూ.10,116 నగదును గురువారం సహయంగా అందజేశారు. ఆలయాభివృద్ధికి తోడ్పాటునందించిన రమేశ్ ను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. మాజీ సర్పంచ్ రాగుల నర్సయ్య, గుభిరే మల్లేశం, బోనగం రాజేశం, లక్ష్మినారాయణ, అంజయ్య, దేవిశేట్టి సాయి తదితరులు పాల్గొన్నారు.