తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 5 కే రన్

నవతెలంగాణ – చేర్యాల: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుండి 5కే రన్ నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ అంకుగారి స్వరూప రాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ రెడ్డి,చేర్యాల,కొమురవెళ్లి, మద్దూరు ఎస్ఐ లు యూ. భాస్కర్ రెడ్డి, చంద్రమోహన్ యాదవ్, నారాయణ, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, డాక్టర్లు, యువకులతో కలసి 5కె రన్ లో పాల్గొన్నారు. అనంతరం సీఐ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య చేర్యాల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని,ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యం బాగుండాలంటే ప్రతిరోజు యోగా, రన్నింగ్, వాకింగ్, ధ్యానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, కౌన్సిలర్ ఆడెపు నరేందర్, స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు పిల్లి ఆనంద్, ఉమేష్, అంబాల వెంకటేశం, నవీన్, పీటీలు రఫత్ ఉమర్, రమేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.

Spread the love