స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు ఎంపిక పోటీలు

నవతెలంగాణ -తాడ్వాయి 
మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల క్రీడా ప్రాంగణంలో మండల విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ స్కూల్లో 4, 5వ తరగతుల్లో ప్రవేశానికి ఎంపికలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి యాప సాంబయ్య మాట్లాడుతూ ఎంపికలు హాజరైన వారికి పరుగు, ఎత్తు, బరువు, ఆధారంగా ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. మొత్తం 60 మంది బాలికలు, 25 మంది బాలురు విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 20 మంది బాలురు 20 మంది బాలిక విద్యార్థులను ఎంపిక చేసి జిల్లా స్పోర్ట్స్ స్కూల్లో పంపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల ఎస్ ఎల్ ఎన్ మోడల్ ఆఫీసర్ రేగా కేశవరావు, ప్రధానోపాధ్యాయులు పద్మ, ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం మానేశ్వర్రావు, పీడీలు మదన్మోహన్, లక్ష్మీనారాయణ, సమ్మయ్య, సతీష్, సునీత, మనోహర్, సంధ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love