కేసీఆర్ కోలుకోవాలని ఫ్రూట్ ఫామ్ సమ్మక్క ఆలయంలో పూజలు

నవతెలంగాణ-గోవిందరావుపేట
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తుంటి గాయం నుండి త్వరగా కోలుకోవాలని ఆదివారం మండలంలోని చల్వాయి పంచాయతీ పరిధిలో గల ఫ్రూట్ ఫామ్ సమ్మక్క సారలమ్మ ఆలయంలో చల్వాయి సర్పంచ్ ఈ సం సమ్మయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చల్వాయి సర్పంచి ఈసం సమ్మయ్య ఆలయ ప్రధాన పూజారిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకొని సాధారణ స్థితికి రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నికల అనంతరం కొద్దిగా అనారోగ్యం పారిన పడిన ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ బడే నాగజ్యోతి కూడా కోలుకోవాలని పూజలు నిర్వహించినట్లు సమయ తెలిపారు. ఈ కార్యక్రమంలోకర్లపల్లి సర్పంచ్ ఈ క అంజిబాబు బి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి లకవత్ నరసింహ నాయక్, అధికార ప్రతినిధి బురెడ్డి మధుసూదన్ రెడ్డి,  చల్వాయి గ్రామ ప్రధాన  కార్యదర్శి బై కానీ ఓదెలు  గ్రామ ఉపాధ్యక్షులు కొంపెల్లి కృష్ణారెడ్డి, గామా యూత్ అధ్యక్షులు గుండె శ్యామ్, యూత్ గ్రామ ప్రధాన కార్యదర్శి కురుష పెళ్లి విజయ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు  దర్శనాల సంజీవ బుడిగె రఘువీరు  రైతు కమిటీ అధ్యక్షులు మీసా రవి గోదా కనకయ్య రాస మల్ల సమ్మయ్య ఎస్సీ సెల్ అధ్యక్షులు కుమ్మరి వెంకన్న గజ్జల రంజిత్ గోద శంకర్ పల్లె నాగేంద్ర పాపయ్యపల్లి యూత్ అధ్యక్షులు బండవత్ తిరుపతి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love