కోతుల బాధ నుంచి  విముక్తి కొరకై చిన్న ప్రయత్నం

నవతెలంగాణ-గోవిందరావుపేట
పసర గ్రామ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కోతుల బాధ నుండి విముక్తి కొరకై చిన్న ప్రయత్నం చేస్తున్నట్లు సుమలత సక్రనాయక్ లు తెలిపారు. ఆదివారం సుమలత సక్రు నాయక్ లు మీడియాతో మాట్లాడుతూ పసర గ్రామంలో కోతులను నియంత్రించేందుకు సొంత ఖర్చులతో బోనులను ఏర్పాటు చేశారు. ఆహారాన్ని ఏరగదీసి బోనులో బంధించి వాటిని ట్రాక్టర్లోకి ఎక్కించి బయట విడిచి పెట్టాలన్నది లక్ష్యం. కోతుల పట్టుట గురించి ఇనుపకంచ( బోన్) పక్క గ్రామాల నుండి కిరాయికి తీసుకొచ్చి మొదలు పెట్టడం జరిగిందన్నారు. ఈ గ్రామంలో కోతుల సమస్య వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కంటికి నిద్ర లేకుండా రైతులు బాధపడుతున్నారు. అందులో భాగంగా సుమలత సక్రు నాయక్ దంపతులు సొంత ఖర్చులతో కోతులను కొంతమేరనైనా పట్టి అడవిలోకి పంపుట గురించి దుంపలగూడెం గ్రామం నుండి బోన్ కిరాయికి తీసుకురావడం జరిగింది. వారికి సమ్మక్క సారక్క వాటర్ ప్లాంట్ ముందున్నటువంటి గల్లీ వారీ సహాయంతో తేవడం జరిగింది. అందులో భాగంగా పట్టపు మల్లారెడ్డి. ఎర్రదనమ్మ. ధరావత్ పున్నం చందర్. గల్లి వారు సహకారం  చేశారు. కోతులు మీ గల్లీలో ఇంకెక్కడైనా ఉంటే, బోను అవసరం అయితే ఆ గల్లీ కూడా ఈ బోనులు తీసుకువెళ్లి పట్టే ప్రయత్నం చేసి అడవికి పంపుదాం ఇది అందరూ కలిసి వస్తే మన పసర నుండి కోతుల బారి నుండి రక్షించుకోవచ్చన్నారు. పదవిలో ఉన్న సర్పంచ్ పట్టించుకోకపోయినా గత సర్పంచ్ ఎన్నికలలో ఓటమి చెందిన సుమలత మరియు సక్రు నాయక్ దంపతులు కోతులను నియంత్రించేందుకు సొంత ఖర్చులతో చర్యలు చేపట్టడాన్ని గ్రామస్తులు అభినందిస్తున్నారు. వరదలు వచ్చిన సమయంలో కూడా గ్రామంలోని వరద బాధితులకు నిత్యవసర వస్తువులు మరియు ఆర్థిక సహకారాలు అందించారు. గ్రామంలో జరుపుకుంటున్న పండుగలకు తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తూ గ్రామస్తులు మన్నలను పొందుతున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా యువత కు ఉట్టి కొట్టే పోటీలలో బహుమతులు ఏర్పాటు చేసి ప్రోత్సహించారు. ప్రజా సేవకు పదవులే అవసరం లేదన్న అభిప్రాయాన్ని సుమలత సక్రు నాయక్ దంపతులు తెలిపారు.
Spread the love