ఎన్ కౌంటర్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి 

– మాజీ ఎంపీ సీతారాం నాయక్

నవతెలంగాణ – గోవిందరావుపేట
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో జరిగిన ఎన్కౌంటర్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మాజీ ఎంపీ అజ్మీర్ సీతారాం నాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని పసర గ్రామంలో కొండ్రెడ్డి చెన్నారెడ్డి ఫంక్షన్ హాలులో  మండల అధ్యక్షుడు మద్దినేని తేజ రాజు బీజేపీ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీతారాం నాయక్ హాజరై మాట్లాడారు. వెంకటాపురం మండలంలో జరిగిన ఎన్కౌంటర్ పై ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఒకప్పుడు మావోయిస్టులు ప్రగతి భవన్ ను పేల్చివేసి నిబద్ధతను చాటుకోవాలని మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న ఎన్కౌంటర్లపై ఎందుకు నోరు మెదపడం లేదని అన్నారు. నిజమైన ఎన్కౌంటర్ ఆ బూటకపు ఎన్కౌంటర్ ఆ అన్నది ప్రభుత్వ స్వస్థత ఇవ్వకపోతే ప్రజలకు ఎలా తెలుస్తుందని అన్నారు. ప్రభుత్వంపై స్పష్టమైన సమాధానం లేకపోవడం ప్రభుత్వ అసమర్ధ పాలనకు పట్టం కడుతుంది అన్నారు. కాంగ్రెస్ 4 నెలల పరిపాలనలో రాష్ట్రంలో కరువు విలయతడవం చేస్తుందని కరువుతో రైతులు పంటలు ఎండి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని కరువు మండలాలుగా ప్రకటించకపోవడం కరువుపై నివేదిక కేంద్రానికి పంపకపోవడం ప్రభుత్వ చేతకానితనాన్ని ప్రజలకు తెలియపరుస్తుందని అన్నారు. ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతు కూలీలకు 12 వేల సహాయం అందిస్తామని అమలు కానీ ఆచరణ సాధ్యం కానీ హామీలతో వచ్చిన ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉండడం ద్వారా అభివృద్ధి వేగంగా జరుగుతుందని పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించి ఆర్థిక అభివృద్ధికి ప్రజలు పడ్డం కట్టాలని పిలుపునిచ్చారు. బిజెపితోనే సుస్థిర పాలన సాధ్యమని అన్నారు. తాను పనిచేసిన ఐదు సంవత్సరాల ఎంపీ కాల వ్యవధిలో ఎన్నో అభివృద్ధి పనులను సాధించాలని తాను అభివృద్ధి పరిచిన పనులపై సాక్షాలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు ములుగు గిరిజన యూనివర్సిటీ సాధనలోను సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం చేసిన ప్రయత్నంలోనూ తాను ముందున్నానని అన్నారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడంలో ఎంతో గట్టిగా ప్రయత్నం చేయడం జరిగిందని పార్లమెంటులో ఎన్నోసార్లు తన గొంతు వినిపించడం జరిగిందని అన్నారు. మండలంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృంగిన వంతెనను 24 గంటల్లో మరమ్మతు చేయించడంలోనూ ఎంపీ ల్యాండ్స్ ద్వారా సిసి నిర్మాణాలు చేయడంలోనూ ముందున్నానని అన్నారు. పార్లమెంటులో ఎంపీగా 42 సార్లు 120 ప్రశ్నలను అడిగి నియోజకవర్గ చరిత్రలో అత్యధికంగా మాట్లాడిన గుర్తింపు పొందడం జరిగిందని అన్నారు. నియోజకవర్గంలో రకరకాల వనరులు ఉన్నప్పటికిని అభివృద్ధి చెందకపోవడానికి కారణం ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తులు ప్రజాప్రతినిధులు లేకపోవడం లోకమని ప్రొఫెసర్ చదివిన తనకు నియోజకవర్గ అభివృద్ధి కోసం వనరుల సద్వినియోగం కోసం కృషిచేసి మాట్లాడే అంత సత్తా ఉందని ఆయన అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో బిజెపి తరఫున పోటీ చేస్తున్న తరుణ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందుకోసం మండల కమిటీ సభ్యులు టీం వర్క్ తో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం జిల్లా ఇన్చార్జి నరోత్తం రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి, ప్రచార కన్వీనర్ రుద్రారం, సురేష్ పార్లమెంటు కో కన్వీనర్ తక్కెళ్ళపల్లి, దేవేందర్ రావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు నామవరపు విజయలక్ష్మి, మండల మహిళా అధ్యక్షురాలు అంకిరెడ్డి రమాదేవి, కొత్త సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ, నరేంద్రబాబు,గాడి వెంకట్, కర్ర సాంబ శివుడు, మండల కమిటీ నాయకులు బూత్ కమిటీ, సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love