కారు దిగిన తంగళ్ళపల్లి మాజి ఉప సర్పంచ్

నవతెలంగాణ – తంగళ్ళపల్లి
తంగళ్ళపల్లి మండల ఉప సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు పెద్దూరి కారు దిగారు. తంగళ్ళపల్లి మాజీ ఉపసర్పంచ్ తంగళ్ళపల్లి మండల ఉపసర్పంచ్ ల ఫోరం మాజీ అధ్యక్షుడు పెద్దూరు తిరుపతి కారు పార్టీకి ఆదివారం బై బై చెప్పారు. పెద్దూరి తిరుపతి బీఆర్ఎస్ పార్టీకి, పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని మండల అధ్యక్షులు గజబింక రాజన్నకు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తనకు ఇబ్బందులు ఎదురైనప్పుడు పార్టీ నుండి ఎటువంటి సహాయ,సహకారాలు అందలేవని బాధపడుతూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లదించారు.
Spread the love