ఘనంగా ఉగాది, పంచాంగ శ్రవణం వేడుకలు

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా నూతన తెలుగు సంవత్సరాది ప్రొదినామ సంవత్సరం ఉగాది పండుగ వేడుకలను మంగళవారం మండల వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని పసర రాంపూర్ గ్రామంలో రాంపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సూడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు డింగిరి రంగాచార్యులు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం వినిపించారు. ఆదాయము వ్యయము పంటలు రాసులు ఫలితాలు అవమానం రాజపూజ్యం తదితర అంశాల గురించి ఆయా రాశుల వారికి క్లుప్తంగా వివరించి తెలిపారు. అనంతరం షట్రుచు లతో కూడిన ఉగాది పచ్చడి ప్రజలందరికీ పంపిణీ చేశారు. చివరలో వేద పండితములు రంగాచార్యులను కమిటీ శాలువాతో సన్మానించి ఆశీస్సులు పొందారు. త్వరలో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్సవ కమిటీని కూడా ఈ సందర్భంగా ప్రకటించి కళ్యాణ పనులను ప్రారంభించారు.
Spread the love