నవతెలంగాణ – గోవిందరావుపేట
ఎలక్షన్ కోడ్ మరోపక్క మావోయిస్టుల ఎన్కౌంటర్ల నేపథ్యంలో మంగళవారం మండలంలోని పసర గ్రామంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పసర పోలీస్ స్టేషన్ పరిధి లో ఇప్పలగడ్డ చెక్ పోస్ట్, పసర జెడ్ పి హెచ్ స్ హై స్కూల్, మొద్దుల గూడెం గ్రామ శివారు లో ప్రతి వాహనంను అపి క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తూ, వాహన దారుల యొక్క వివరాలు తెలుసుకోవటం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో డబ్బు , మద్యం సరఫరా ను అడుకోవటనికి పగడ్బందిగా చర్యలు చేపట్టుతున్నామని ఈ సందర్బంగా ఎస్సై కమలాకర్ చెప్పటం జరిగింది.