ఇంటి పన్నులు చెల్లిస్తాం.. కట్టుకొని అభివృద్ధి చేయండి

– సోమ మల్లారెడ్డి సీపీఐ(ఎం) గ్రామ కమిటీ సభ్యులు

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామం సుందరయ్య నగర్ వాసులు ఇంటి పనులు చెల్లిస్తారు. కట్టుకొని రసీదులు ఇచ్చి కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని సీపీఐ(ఎం) గ్రామ కమిటీ సభ్యులు సోమ మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సుందరయ్య కాలనీలో కాలనీవాసుల సమావేశం అంబాల మురళి అధ్యక్షుతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో గత సంవత్సరంనరకాలంగా కాలనీవాసులు ఇల్లు నిర్మించుకొని నివాసం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీ అధికారులు వెంటనే నివాస గృహాలను గుర్తించి నెంబర్ ఇచ్చినట్లయితే ఇంటి పన్నులు చెల్లించేందుకు కాలనీ నివాసుల సిద్ధంగా ఉన్నారని అన్నారు. గతంలో రెవెన్యూ అధికారులు ఇది ప్రభుత్వ భూమి అని గుర్తించి ప్రజెంట్ మోకాపై కాలనీవాసులు ఇల్లు నిర్మించుకొని ఉంటున్నారని కలెక్టర్కు నివేదిక కూడా పంపడం జరిగిందని అన్నారు. అప్పటినుండి ఇప్పటివరకు పలువురు కాలనీవాసులు శాశ్వత గృహాలను నిర్మించుకొని చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. వీరిని ఇప్పటివరకు గ్రామపంచాయతీ అధికారులు గుర్తించకపోవడం దురదృష్టకరమని పలుమార్లు అధికారులు అదృష్టక తీసుకుపోయిన స్పందించకపోవడం జరిగిందని అన్నారు. కోట్ల రూపాయల పనులు ఎగవేస్తున్న బడా నాయకులకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వం పన్ను కడతాం అభివృద్ధిలో భాగస్వాములు అవుతాము అని అంటున్న స్పందించకపోవడం లో ఆంతర్యం ఏంటని  ప్రశ్నించారు. ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పక్క గృహాలు నిర్మించుకుని నివాసం చేస్తున్న వారందరినీ శిస్తూ కట్టించుకొని శాశ్వత నెంబర్లు ఇచ్చి కాలనీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అన్నారు. లేనియెడల సుందరయ్య నగర్ కాలనీవాసుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఐ(ఎం) నాయకులతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.
Spread the love