టీచర్స్ కి క్వెస్ట్ ట్రైనింగ్: లయన్ డా.హిప్నో పద్మా కమలాకర్

నవతెలంగాణ హైదరాబాద్: విద్యార్థులు బాగుంటే ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతోందని లయన్స్ ఇంటర్ నేషనల్ క్వెస్ట్ ప్రోగ్రాం ను డిజైన్ చేశారని లయన్ డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు.డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో ఋధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇటివలే 320 లయన్స్ క్వెస్ట్ ఫౌండేషన్ మల్టీ పుల్ కో- ఆర్డినేటర్ పి.డి.జి శివప్రసాద్ ఆధ్వర్యంలో ఓరియెంటేషన్, ప్లానింగ్ ప్రోగ్రామ్ ను హోటల్ మినర్వా గ్రాండ్, సికింద్రాబాద్ లో నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో 320 A డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్లు డి.కోటేశ్వరరావు, డా.జి.మహేంద్రకుమార్ రెడ్డి , 2024- 2025 సంవత్సరానికి గాను క్వెస్ట్ ప్రోగ్రాం కి ఛైర్‌పర్సన్ గా మాధవరావు, కో – ఆర్డినేటర్స్ గా మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన శ్రీహరిని, నన్ను (డా.హిప్నో పద్మా కమలాకర్) ను నియమించారన్నారు. విద్యార్థులకు లైఫ్ స్కిల్స్, క్యారెక్టర్ ఎడ్యుకేషన్, పాజిటివ్ బిహేవియర్, సోషల్ & ఎమోషనల్ లెర్నింగ్ ,అభ్యసనా సామర్థ్యాలు, సేవా తత్వాన్ని, అలాగే నైపుణ్య వృద్ధి, యువకుల సాధికారతకు మద్దతు ఇవ్వడం కోసం, వారిని విలక్షణంగా తీర్చి దిద్దడం కోసం , ప్రభుత్వ/ప్రైవేటు టీచర్స్ కి ఉచితంగా క్వెస్ట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ ట్రైనింగ్ టీచర్స్ కి ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతలో ఆధునిక జీవనంలోని సంక్లిష్టతలను , సవాళ్లను ఎదుర్కొనే తత్వం అలవడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పి ఐ డి ఆర్ సునీల్ కుమార్, లయన్ కె. రేణుక, డాక్టర్ లక్ష్మిమూర్తి , పి . డి.జి.గోవింద రాజు క్వెస్ట్ ప్రోగ్రాం ఆవశ్యకత , విశిష్టతల గురించి వివరించారన్నారు.

Spread the love