తండ్రి, కుమార్తెపై దూసుకెళ్లిన డీసీఎం.. కుమార్తె పరిస్థితి విషమం

రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె తీవ్రగాయాలు
రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె తీవ్రగాయాలు

నవతెలంగాణ హైదరాబాద్‌: బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమార్తె పరిస్థితి విషమంగా ఉండగా, తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం కొంపల్లి నుంచి బోయిన్‌పల్లి బస్‌ స్టాప్‌కు వైష్ణవి, ఆమె తండ్రి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. వాహనం అదుపుతప్పడంతో తండ్రి, కుమార్తె ఇద్దరూ కింద పడ్డారు. ఇదే సమయంలో సుచిత్ర వైపు నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వారిద్దరి పైనుంచి వెళ్లింది. తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో వైష్ణవి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే డీసీఎం డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైష్ణవి ఎమ్‌ఎన్‌ఆర్‌ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఆమెను కళాశాలకు పంపే క్రమంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Spread the love