మల్లన్నసాగర్ నిర్వాసితుల ఊసురుబోసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం

– మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ-తొగుట: మల్లన్నసాగర్ నిర్వాసితుల ఊసురుబోసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మట్టి గొట్టుకపోయిందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలో మెదక్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముది రాజ్ రోడ్ షోలో మంత్రి మాట్లాడుతూ మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేసి వందల కుటుంబాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగం చేసిందన్నారు. ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించకపోవడం బాధాకరం అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి కె రూ.40 కోట్ల నిధులను పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేసినట్లు తెలిపారు. జగన్ కోడి కత్తి లాగా ఇక్కడ గెలుపొందిన ఎమ్మెల్యే పొట్టలో కత్తి పొడిపించుకొని మిమ్ములను మభ్యపెట్టి ఓట్లు వేసుకొని గెలుపొందరని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది నియో జకవర్గాని అభివృద్ధి చేస్తానన్నారు.
కేంద్రం ప్రభు త్వం నుండి ఒక్క రూపాయన్న తీసుకొచ్చావా అని అడిగారు. ఒక వేళ తెస్తే ఈ సెంటర్ కు జీవో కాపీని చూపించాలని సవాల్ విసిరారు. మిమ్ములను మోసం చేసి గెలిచిన వ్యక్తి ఈ రోజు మళ్ళీ ఎంపి మీ ముందుకు వస్తున్నారు. అప్పుడు పని చేయని రఘునందన్ రావు ఇప్పుడు ఎంపీగా గెలిస్తే పని చేస్తారా అని ప్రశ్నించారు. మోసపూరిత మైన మాటలు చెప్పే నాయకులకు దయచేసి ఓటు వేయొద్దని వేడుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇస్తే ఎవరికైనా న్యాయం జరిగిందా అన్నారు. కానీ కేసీఆర్ కుటుంబానికి మేలు జరిగిదన్నారు. ప్రజల సొమ్ము తిని బాగుపడిన చరిత్రలో లేదన్నారు. కేసీఆర్ ప్రజల ఉసురు పోసు కుంది కాబట్టే వల్ల బిడ్డ జైలుకు పోయిందని, రాబో యే రోజుల్లో వీళ్ళు జైలుకు వెళ్లడం ఖాయమన్నా రు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు నీలం మధు ముదిరాజ్, నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి, ఎంపీపీ లత నరేందర్ రెడ్డి, మండల నాయకులు తదితరులు ఉన్నారు.

Spread the love