కవితను బండకేసి కొట్టిన రైతాంగం, అబద్దాల కోరు అరవింద్…

– ఆర్మూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నవతెలంగాణ ఆర్మూర్: మాజీ ఎంపీ కవితను బండకేసి కొట్టిన ఆర్మూర్ రైతాంగం,, అబద్ధాల కోరు గుండు ధర్మపురి అరవింద్ లు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం రాత్రి జరిగిన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ 40 ఏండ్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ, ఎంపీగా మచ్చలేని నాయకునిగా అహర్నిషాలు రైతాంగనికి బడుగు బలహీన పేద ప్రజల సంక్షేమానికి కృషిచేసిన జీవన్ రెడ్డిని గెలిపించాలని అన్నారు. తమకు మద్దతు తెలపడానికి వచ్చిన కమ్యూనిస్టు సోదరులకు సైతం కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పట్టణ రైతాంగం 2021లో ధర్నా నిర్వహించినప్పుడు తాను వచ్చినట్టు వివిధ గ్రామాల రైతులు అపూర్వ స్వాగతం పలికినట్టు దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, పీసీసీ అధ్యక్షునిగా సోనియా గాంధీకి నమ్మకం కల్పించినట్టు తెలిపారు. 2014 లో 100 రోజుల్లో చక్కెర కర్మాగారం చేస్తానని మాజీ ఎంపీ కవిత చెప్పి పదేండ్లు అయిన చక్కెర కర్మాగారం రాలేదని, 2019 లో ఇక్కడి ప్రాంత రైతాంగం వందమంది నామినేషన్ వేసి బండకసి కొట్టినట్లు 2012లో ఓ గుండు అరవిందు ఐదు రోజుల్లో పసుపు బోర్డు అంటూ బాండ్ పేపర్ రాసిచ్చి ఇప్పటికీ రైతాంగాన్ని మోసం చేస్తూనే ఉన్నారని తెలిపారు.
మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలలో నకిలీ జీవన్ రెడ్డిని తరిమికొట్టినట్టు ఈసారి అరవిందును ఓడించాలని అన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చిన ప్రధాని మోడీకి హర్యానా,, పంజాబ్ రైతన్నల తిప్పి కొట్టిన స్ఫూర్తి ఆర్మూర్ రైతాంగనికి ఉందని, పట్టణ టిఎస్ఆర్టిసి భూమి యందు మల్టీప్లెక్స్ కట్టి న ఒకరు ,ఇతర దేశాలలో వ్యాపారాలు చేసుకునే వారు ఒకరని, ఎర్ర జొన్న ,మొక్కజొన్న వరి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, 5 బోనస్ ఇస్తామని, 69 లక్షల రైతులకు రైతుబంధు వేసినట్టు తెలిపారు గత పది సంవత్సరాలుగా ఎన్నోసార్లు జైలుకు పంపిన, అక్రమ కేసులు పెట్టిన ప్రజా సమస్యల పోరాటానికై ఇందిరమ్మ రాజ్యం తెచ్చిందని ,,పట్టణ సిద్దుల గుట్ట సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని,, దేశంలోనే ఆదర్శ గ్రామమైన అంకాపూర్ తో పాటు జిల్లా ప్రజలు 2014 లో బిఆర్ఎస్, 2019 లో బిజెపి ఇద్దరినీ చూసినట్లు ఒక అవకాశం టీ జీవన్ రెడ్డికి ఇవ్వాలని,, ఎన్నికల కోడ్ తర్వాత మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి,, విలీన గ్రామాల సమస్యలు తీర్చడానికి 16 కోట్ల రూపాయలు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ అరవింద్ పసుపు బోర్డు బాండ్ పేపర్ రాసి రైతులను మోసం చేసినారని, జక్రాన్ పల్లి లో ఏర్పాటు రాలేదని, లక్కంపల్లి సేజు ఇక్కడి నిరుద్యోగుల కలలు ఆవిరి అయినాయని, నష్టాల నే పంతో మూసివేసిన ముత్యంపేట, బోధన్ చక్కెర పరిశ్రమలను తెరిపించి, రైతుల కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, అందులో భాగంగానే నలభై మూడు కోట్లు విడుదల చేసిందని అన్నారు. బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గాల ఇన్చార్జులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, పొద్దుటూరి వినయ్ రెడ్డిలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, అరికెల నర్సారెడ్డి, సుంకేట అన్వేష్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, పెర్కిట్ చిట్టి రెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎర్రజెండాలు..
పట్టణంలో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు సీపీఐ(ఎం) నాయకుల ఎర్రజెండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాయకులు పల్లపు వెంకటేష్, కుతాడి ఎల్లయ్యల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా ఎర్ర దండుతో రెపరెపలాడింది.

Spread the love