బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏకధాటిగా జరుగుతోంది. అన్ని కమర్షియల్ అంశాలతో యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలు, అత్యన్నత సాంకేతిక ప్రమాణాలతో, భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ థండర్‌ను రామ్ పుట్టినరోజు కానుకగా నేడు (సోమవారం) విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రామ్ డాషింగ్, డైనమిక్‌గా కనిపిస్తున్నారు. స్టైలిష్ హెయిర్‌తో, గుబురు గడ్డం రగ్గడ్ నెస్ ని తీసుకొచ్చింది. డెనిమ్ షర్ట్, జీన్స్ ధరించి రామ్ తన చేతిలో బేస్ బాల్ బ్యాట్‌తో ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. బ్యాగ్రౌండ్‌లో పెద్ద ఎద్దును కూడా చూడవచ్చు. ఈ సినిమాలో మాసీవ్ క్యారెక్టర్‌లో నటించేందుకు రామ్ బీస్ట్ లుక్‌లో కనిపించారు. హీరోయిన్ శ్రీలీల ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రామ్‌కు జోడిగా నటిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 20న హిందీతోపాటు అన్ని దక్షిణ భారతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
రామ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొంది బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’.
ఈ సినిమా విడుదలైన దాదాపు నాలుగు సంవత్సరాలైంది. తాజాగా ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌లో
మరో సినిమా రాబోతోందని రామ్ బర్త్‌డేకి గిఫ్ట్‌గా ఒక్కరోజు ముందే మేకర్స్ అనౌన్స్ చేయటం విశేషం. పూరి కనెక్ట్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విషు రెడ్డి సీఈవో.
ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి ‘డబుల్ ఇస్మార్ట్’ అని పేరు పెట్టారు. ఇది ఈసారి రెట్టింపు మాస్, రెట్టింపు వినోదాన్ని ఇవ్వబోతుంది. పూరి జగన్నాధ్ చాలా పెద్ద స్పాన్ కలిగిన కథ రాశారు. అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో, భారీ స్థాయిలో హై బడ్జెట్‌తో రూపొందనుంది. అనౌన్స్‌మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో త్రిశూలం పై రక్తపు గుర్తులు ఉన్నాయి. ఈ పోస్టర్ ఇస్మార్ట్ శంకర్ సెకండ్ ఫ్రాంచైజీ నేపథ్యం గురించి సూచిస్తోందని వేరే చెప్పక్కర్లేదు. ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతోంది. వచ్చే ఏడాది మహా శివరాత్రి కానుకగా ఈ చిత్రాన్ని మార్చి 8న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల
వివరాలను త్వరలో అనౌన్స్ చేస్తారు.ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్,
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్.