ఘనంగా వీరసింహారెడ్డి 100 రోజులు వేడుక

నందమూరి బాలకష్ణ 107వ చిత్రం ‘వీర సింహారెడ్డి’ ప్రేక్షకుల విశేష ఆదరణతో 100 రోజులు పూర్తి చేసుకుంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి బయ్యర్లందరికీ భారీ లాభాలను అందించింది. బాలకష్ణ పుట్టినరోజు సందర్భంగా ‘వీర సింహారెడ్డి’ 100 రోజుల వేడుకను మేకర్స్‌ ఘనంగా జరిపారు.చిత్రయూనిట్‌తోపాటు డిస్ట్రిబ్యూటర్స్‌ అందరికీ కూడా ఈ చిత్ర శతదినోత్సవ షీల్డ్‌లను అందించారు.
ఈ వేడుకలో దర్శకులు అనిల్‌ రావిపూడి, బాబీ, హరీష్‌ శంకర్‌, శివ నిర్వాణ, బుచ్చిబాబు, నిర్మాతలు నాగ వంశీ, సాహు గారపాటి, హరీష్‌ పెద్ది తదితరులు హాజరై, అరుదైన శతదినోత్సవ వేడుక అని కొనియాడారు.

Spread the love