చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన సినిమా ”అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 21న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను డైరెక్టర్ మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ సినిమాని చెందు 80, 90 బ్యాక్ డ్రాప్‌లో నేటివిటీ ఎక్కడా మిస్ కాకుండా యూనిక్‌గా తెరకెక్కించాడు. లావణ్య, చైతన్య ప్రామిసింగ్‌గా నటించారు. ఇలా క్రియేటివిటివ్‌గా, ప్యాషన్‌గా రూపొందించే చిత్రాలు చాలా తక్కువగా ఉంటాయి. టీజర్ చూస్తే ఇదొక క్వాలిటీ ఫిల్మ్ అనిపిస్తోంది. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు. ‘టీజర్‌తో మా సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. మా సినిమాలోని బ్యూటీ చూడబోతున్నారు’ అని హీరో చైతన్యరావ్ అన్నారు. దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ, ‘నా గత చిత్రంలాగే ఇందులో కూడా సరికొత్త స్క్రీన్ ప్లే చూస్తారు. ఒక మంచి కథను ఆసక్తికర కథనంతో, అందమైన లొకేషన్స్‌తో, ఆకట్టుకునే మ్యూజిక్‌తో తెరకెక్కించాను. ఇప్పుడొస్తున్న చిత్రాలతో పోలిస్తే ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. వచ్చిన అవుట్ పుట్‌తో సంతోషంగా ఉన్నాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చిత్రమవుతుంది’ అని తెలిపారు.